Sun Dec 14 2025 18:10:39 GMT+0000 (Coordinated Universal Time)
Fengal Cyclone : నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఫెంగల్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో చిత్తూరు కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు

నేడు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు ఏవీ సోమవారం తెరవవద్దని కోరారు.
తుపాను ప్రభావంతో...
తుపాను ప్రభావం నేపథ్యంలో సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు కూడా సెలవు ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సెలవుగా పరిగణించి విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ కోరారు. అయితే తిరుపతి జిల్లాలో విద్యాసంస్థల సెలవుపై అధికారులు మాత్రం ప్రకటన చేయలేదు. ఈరోజు ప్రకటన చేసే అవకాశముంది. ఈ జిల్లాలో కూడా సెలవు ప్రకటించే అవకాశముంది.
Next Story

