Mon Dec 23 2024 17:00:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి రెండ్రోజులు భారీ వర్షసూచన
భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. బుధవారానికి వర్షాలు తగ్గుముఖం..
ఏపీలో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందని, ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ ద్రోణి ప్రభావంతో నేడు, రేపు ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కూడా పడొచ్చని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. బుధవారానికి వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఉమ్మడి అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దపప్పూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవగా.. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో కురిసిన భారీ వర్షానికి సంపతికోట వాగు పొంగడంతో.. ఓ కారు చిక్కుకుపోయింది. అందులో ఉన్న కుటుంబసభ్యులను రక్షించుకున్న యువతి.. తాను మాత్రం ఊపిరాడక చనిపోయింది.
Next Story