Mon Dec 23 2024 12:54:32 GMT+0000 (Coordinated Universal Time)
"అనంత"లో భారీ వర్షం.. నీట మునిగిన కాలనీలు
అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో అనంతపురం పట్టణంలోని పలు కాలనీలకు వరద నీరు ప్రవేశించింది
అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో అనంతపురం పట్టణంలోని పలు కాలనీలకు వరద నీరు ప్రవేశించింది. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం, రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి చంద్రబాబు కొట్టాల గౌరవ రెసిడెన్సీ కాలనీ, విశ్వశాంతి నగర్, రుద్రంపేట వంటి ప్రాంతాలు మునిగిపోయాయి. ఆలమూరు చెరువు గట్టు తెగి పోవడంతో ఆ నీరు కాలనీలోకి ప్రవేశించింది.
సురక్షిత ప్రాంతాలకు...
నీటిలో చిక్కుకున్న కుటుంబాలను పోలీసులు రక్షించారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమనాథ్ నగర్ వంతెన మీదకు కూడా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపేశారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సందర్శించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story