Tue Nov 05 2024 16:44:45 GMT+0000 (Coordinated Universal Time)
అసని ఎఫెక్ట్.. ఐదు జిల్లాలకు భారీవర్షసూచన, 11 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
విజయవాడ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను వేగం కాస్త తగ్గింది. గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో అంతర్వేది తీరం వైపుగా పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 30, నర్సాపురానికి 50 కిలోమీటర్ల దూరంలో అసని తుఫాను కేంద్రీకృతమై ఉంది. తుఫాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల అంచనా. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077, కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100, శ్రీకాకుళం: 08942-240557, తూర్పు గోదావరి: 8885425365, ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077, విజయనగరం: 08922-236947, పార్వతీపురం మన్యం: 7286881293, మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572, మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486, బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920, విశాఖ: 0891-2590100,102, అనకాపల్లి: 7730939383నంబర్లను ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన వారు ఈ నంబర్లను సంప్రదించవచ్చని ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.
Next Story