Fri Dec 20 2024 10:58:08 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : ఏపీలో నేడు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడుతుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లో అతి భారీ వర్షాలు నేడు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిన అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా కదులుతూ రానున్నసమయంలో ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తా తీరం వైపు చేరే అవకాశముంది. ఆతర్వాత మరికొద్ది గంటల్లో ఉత్తరం వైపు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో భారీ వర్షం పడే అవకాశముందని తెలిసింది. ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.
ఈరోజు వర్షం...
ఈ అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను హెచ్చరించారు.
బలమైన గాలులు వీచే...
మత్స్యకారులు ఆదివారం వరకూ చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో అల్పపీడనం ప్రభావంతో ఈరోజు నుంచి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. తీరం వెంట గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే నదులు, వాగులు దాటే సమయంలో వాహనదారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భారీవర్షాలతో లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అలెర్ట్ గా ఉంటూ అవసరమైతే పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story