Rain Alert : ఏపీలో బలపడిన అల్పపీడనం.. అతి భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్ లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ కోస్తా వైపు ప్రయాణించి తమిళనాడు తీరానాకి చేరుకునే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రానున్న కొద్ది గంటల్లో మరింత బలపడి ఉత్తరదిశగా ఆంధ్రతీరం వైపు పయనించే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now