Tue Nov 05 2024 19:47:42 GMT+0000 (Coordinated Universal Time)
Mandous Effect : మరో 48 గంటలపాటు భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన అరుణానది
తిరుపతి సమీపంలోని అరుణానది ఉగ్రరూపం దాల్చింది. మరో 48 గంటల వరకూ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో..
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను శనివారం తెల్లవారుజామున తీరం దాటింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తిరుపతిలోని పలు ప్రధాన రహదారులు వర్షపునీటితో నదులను తలపిస్తున్నాయి.
తిరుపతి సమీపంలోని అరుణానది ఉగ్రరూపం దాల్చింది. మరో 48 గంటల వరకూ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు ఇళ్లనుండి బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అలాగే మాండూస్ ప్రభావం విశాఖపై కూడా ఉంటుందన్నారు. విశాఖపట్నం, అరకు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చని స్పష్టం చేశారు. అలాగే కడప, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Next Story