Mon Dec 23 2024 02:56:17 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బెయిల్ పిటీషన్ వాయిదా
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏసీబీ కోర్టులో తన బెయిల్ పిటీషన్ కొట్టివేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు వచ్చే 19వ తేదీకి వాయిదా వేసింది.
38 రోజులుగా...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గత 38 రోజులుగా జైలులో ఉన్నారు. ఆయన అనేక సార్లు బెయిల్ పిటీషన్ వేశారు. కానీ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణ ఉంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్ పై తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలుండటంతో చంద్రబాబు తరుపున న్యాయవాదులు అందుకోసం ఎదురు చూస్తున్నారు.
Next Story