Sun Dec 22 2024 22:44:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా
చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది
చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 15వతేదీకి....
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ నెల 28వ తేదీ వరకూ ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈరోజు రెగ్యులర్ బెయిల్ పై విచారించిన న్యాయస్థానం మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story