Tue Dec 24 2024 00:49:52 GMT+0000 (Coordinated Universal Time)
"చింతామణి"పై హైకోర్టు ఆగ్రహం
చింతామణి పుస్తకాన్ని రద్దు చేయకుండా నాటకాన్ని ఎలా రద్దు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
చింతామణి నాటకం నిషేధంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చింతామణి పుస్తకాన్ని రద్దు చేయకుండా నాటకాన్ని ఎలా రద్దు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నాటకంలో పాత్రలు వేటిపైనైనా అభ్యంతరాలుంటే పాత్రను రద్దు చేయాలే తప్ప నాటకాన్ని రద్దు చేయడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటకాన్ని నిషేధించడంపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పుస్తకాన్ని నిషేధించకుండా?
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
Next Story