Sat Nov 23 2024 04:29:46 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నం పోర్టు పై తీర్పు రిజర్వ్
మచిలీపట్నం పోర్టు పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది.
మచిలీపట్నం పోర్టు పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 66ను సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో సెప్టంబరులో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఆగస్టు 25న న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ వై రమేష్ ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన ధర్మాసన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వ్ లో ఉంచింది.
ఇరు వర్గాల వాదనలు....
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను ప్రభుత్వం అప్పగించకుంటే ఎలా పూర్తి చేస్తామని నవయుగ సంస్థ తరుపున న్యాయవాదులు వాదించారు. తమకు భూములను అప్పగించడంలో ప్రభుత్వం విపలమయిందని పేర్కొన్నారు. మొత్తం భూములను ఒకేసారి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మొత్తం భూమిని ఒకేసారి అప్పగించాల్సిన అవసరం లేదని, నవయుగ సంస్థ ఒప్పందం ప్రకారం షరతులను ఉల్లంఘించిందని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. దీనిపై ఇరువరి వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
Next Story