Thu Dec 19 2024 15:10:20 GMT+0000 (Coordinated Universal Time)
సాల్వే కూడా సాధించలేకపోయారే
చంద్రబాబు క్వాష్ పిటీషన్ కేసులో హరీశ్ సాల్వే వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ ఆ పార్టీ నేతలు చేశారు. పేరుమోసిన న్యాయవాదుల చేత ఈ కేసు వాదించారు. ఖరీదైన లాయర్లను ఎంగేజ్ చేసుకుని మరీ చంద్రబాబు తరుపున వాదనలను వినిపంచారు. పేరు మోసిన హరీశ్ సాల్వేతో పాటు ప్రముఖ క్రిమినల్ లాయర్ సిద్ధార్థ లూథ్రా కూడా ఈ కేసులో వాదించారు. చంద్రబాబుకు ఈ కేసుతో సంబంధం లేదని వాదించారు. ఆయనను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారంటూ తమ వాదనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి.
పేరున్న న్యాయవాదులను...
అయినా హరీశ్ సాల్వే వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సీఐడీ తరుపున న్యాయవాదుల వాదనతో పూర్తిగా ఏకీభవించింది. క్వాష్ పిటీషన్ కూడా కొట్టివేయడంతో ఇక చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. మరోవైపు ఏసీబీ కోర్టు చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటీషన్ పైన కూడా కాసేపట్లో విచారణ జరగనుంది. క్వాష్ పిటీషన్ ను కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి ఏకవాక్యంతో తీర్పు చెప్పి వెళ్లిపోయారు. క్వాష్ పిటీషన్ పై తీర్పు కోసం ఏసీబీ కోర్టు తీర్పును పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే.
Next Story