Mon Dec 23 2024 02:43:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదా
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత విచారిస్తామని తెలిపింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపించారు.
వాదనలు విన్న తర్వాత....
రెండు నెలల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే నలభై రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్నారన్నారు. ఆయన హెల్త్ రిపోర్టులను కూడా కోర్టుకు సమర్పించామని తెలిపారు. అయితే సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తూ చంద్రబాబు మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తీర్పును సుప్రీంకోర్టులో రిజర్వ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
Next Story