Sun Jan 12 2025 02:03:52 GMT+0000 (Coordinated Universal Time)
30న డీజీపీ కోర్టుకు హాజరవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. చట్ట ప్రకారం ఎందుకు వ్యవహరించడం లేదో వివరణ ఇవ్వాలని కోరింది
ఆంధ్రప్రదేశ్ అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. చట్ట ప్రకారం ఎందుకు వ్యవహరించడం లేదో వివరణ ఇవ్వాలని కోరింది. రేషన్ బియ్యం పేరుతో రైస్ మిల్లర్లను, వాహనదారులను వేధించడంపై జరిగిన విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం దీనిపై పిటీషన్ వేసింది. ఎసిడెన్సియల్ కమోడిటీసీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.
నిబంధనలను పాటించకుండా....
నిబంధనలను పాటించకుండా రైస్ మిల్లులోని ఐదు వాహనాలను సీజ్ చేయడాన్ని కూడా పిటీషనర్లు హైకోర్టు దృష్టిికి తీసుకు వచ్చారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని చెప్పారు. అక్రమంగా బియ్యం తరలింపు జరుగుతుందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. గతంలో ఎన్నిమార్లు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోక పోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 30వ తేదీన డీజీపీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
Next Story