Wed Dec 18 2024 20:42:25 GMT+0000 (Coordinated Universal Time)
నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్
సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది
సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్, లింగమనేని రమేష్, రాజశేఖర్ లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు...
మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయని ఆళ్ల సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ వీరిపై కేసు నమోదు చేసింది. వీరంతా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటీషన్ వేయగా విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.
Next Story