Mon Dec 23 2024 07:49:47 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్న కు ఊరట.. హైకోర్టులో స్టే
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చి వేతపై హైకోర్టు స్టే విధించింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి కూల్చి వేతపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఇంటి గోడలు కూల్చ వద్దంటూ అధికారులను ఆదేశించింది. అర్ధరాత్రి కూల్చి వేల్చతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను కూడా థిక్కరిస్తే ఎలా అని ప్రశ్నించింది. నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యవసాయ పంట కాల్వను ఆక్రమించి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారంటూ నిన్న తెల్లవారుజాము నుంచి కూల్చివేతలకు అధికారులు సిద్ధమయిన సంగతి తెలిసిందే.
అర్థరాత్రి కూల్చివేతలపై....
అయితే అయ్యన్న పాత్రుడు కుమారులు చింతకాయల విజయ్, రాజేష్ లు దీనిపై హౌస్మోషన్ పిటీషన్ ను హైకోర్టులో వేశారు. పిటీషనర్ల తరుపున వీవీ సతీష్ వాదించారు. ప్లాన్ ప్రకారమే ఇంటిని నిర్మించారని, మున్సిపల్ అధికారులు కూడా ప్లాన్ ను ఆమోదించారని తెలిపారు. రాజకీయ కక్షలతోనే అర్థరాత్రి జేసీబీలతో కూల్చివేతలకు దిగారని పిటిషన్ లో పేర్కొన్నారు. సూర్యాస్థమయం తర్వాత కూల్చివేతలు వద్దని హైకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇదేం పద్ధతి అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ కూల్చివేతలు నిలిపేయాలని ఆదేశించింది. దీనిపై విచారణను ఈ నెల 21వ తేదీ కి వాయిదా వేసింది.
Next Story