Mon Dec 23 2024 04:05:18 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బెయిల్ కు ఐదు షరతులు ఇవే ఇవే
చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు ఐదు షరతులు విధించింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు హైకోర్టు విధించింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తనకు నచ్చిన ఆసుపత్రిలో, సొంత ఖర్చుతో చికిత్స చేయించుకోవాలని, లక్ష పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. కేసును ప్రత్యక్షంగా, పరోక్షంగాని ప్రభావితం చేయకూడదని తెలిపింది నవంబరు ఇరవై ఎనిమిదో తేదీన తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.
నచ్చిన ఆసుపత్రిలో...
సాక్షులను ఎలాంటి ప్రభావితం చేయకూడదని హైకోర్టు తెలిపింది. నచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని తెలిపింది. ఆయన ఎక్కడ చికిత్స చేయించుకున్నదీ సరెండర్ అయ్యే సమయంలో సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని కోరింది. దీంతో చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరి వెళతారని తెలిసింది. అక్కడ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో కంటి ఆపరేషన్ చేయించుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో ప్రత్యేక రూంను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Next Story