Tue Dec 24 2024 13:03:35 GMT+0000 (Coordinated Universal Time)
జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
పీఆర్సీ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
పీఆర్సీ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. పీఆర్సీపై దాఖలయిన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా పిటీషనర్ తరుపున న్యాయవాది పీఆర్సీ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని చెప్పారు. హెచ్ఆర్ఏను విభజన చట్ట ప్రకారం చేయలేదని పేర్కొన్నారు. హెచ్ఆర్సీ వల్ల తమ జీతాల్లో కోత విధించారని పిటీషనర్ తరుపున న్యాయవాది పేర్కొన్నారు.
అంకెల్లో పెరిగిందా? లేదా?
అయితే దీనిపై హైకోర్టు మాత్రం జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని వ్యాఖ్యానించింది. పిటీషన్ వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. ప్రభుత్వం తరుపు న్యాయవాది సయితం నూతన పీఆర్సీ వల్ల జీతాలు పెరుగుతాయని వాదించారు. అంకెల్లో జీతం పెరిగిందా? లేదా? చెప్పాలని న్యాయస్థానం కోరింది. గ్రాస్ శాలరీ ప్రతి ఒక్కరికీ పెరిగిందని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. పీఆర్సీ పెరిగిందా? లేదా? అన్నది కూడా చెప్పాలని కోరింది.
- Tags
- high court
- prc
Next Story