Wed Apr 16 2025 23:33:15 GMT+0000 (Coordinated Universal Time)
రిషికొండ నిర్మాణాలపై రిపోర్ట్ ఇవ్వండి : హైకోర్టు
విశాఖలోని రుషికొండలో భవన నిర్మాణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

విశాఖలోని రుషికొండలో భవన నిర్మాణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హైకోర్టు నియమించిన కమిటీ నివేదిక ఇచ్చింది. అనుమతికి మించి నిర్మాణాలను చేపట్టాలని కమిటీ నివేదికలో పేర్కొంది. దీంతో హైకోర్టు నిబంధనల అతిక్రమణలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవలని అటవీశాఖతో పాటు పర్యావరణ శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.
మూడు వారాల్లో...
రుషికొండ నిర్మాణలపై ఏం చర్యలు తీసుకున్నారో మూడు వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలంటూ అటవీ, పర్యావరణ శాఖ సెక్రటరీలను హైకోర్టు ఆదేశించింది. విశాఖలో రుషి కొండపై ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇది పర్యావరణానికి ప్రమాదమని కొందరు హైకోర్టును ఆశ్రయించగా దీనిపై హైకోర్టు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
Next Story