Wed Dec 18 2024 21:46:30 GMT+0000 (Coordinated Universal Time)
Pinnelli : పిన్నెల్లి బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పు
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. దీంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. దీంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొద్ది రోజుల నుంచి నెల్లూరు జైలులోనే ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎం దగ్దం కేసు, హత్యాయత్నం వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి.
నెల్లూరు జైలులో...
దీంతో ఆయనను పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేశారు. అయితే ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ప్రభుత్వం తరుపున న్యాయవాదుల వాదన విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పను రిజర్వ్ చేసింది. నేడు బెయిల్ పై తీర్పు చెప్పనుంది.
Next Story