Thu Dec 26 2024 08:16:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీపీఎస్సీ పరీక్షపై నేడు హైకోర్టులో విచారణ
ఏపీపీఎస్సీ పరీక్షపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి రెండు సార్లు మూల్యాంకనాలు జరిగాయని కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారించిన న్యాయమూర్తి పరీక్షను రద్దు చేశారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును...
అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో నేడు ఏపీపీఎస్సీ పరీక్షపై హైకోర్టు ధర్మాసనం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనోనన్న ఉత్కంఠ ఇటు పరీక్ష రాసిన అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ నెలకొని ఉంది.
Next Story