Wed Apr 02 2025 04:24:21 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : పోస్టల్ బ్యాలట్ పై రేపు తీర్పు
రేపు సాయంత్రం ఆరు గంటలకు హైకోర్టు పోస్టల్ బ్యాలెట్ పై తీర్పు వెలువరించనుంది.

పోస్టల్ బ్యాలట్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు సాయంత్రం ఆరు గంటలకు హైకోర్టు పోస్టల్ బ్యాలెట్ పై తీర్పు వెలువరించనుంది. పోస్టల్ బ్యాలట్ లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దేశమంతా ఒకలా, ఏపీలో ఒకలా ఎలా ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేస్తుందని తమ పిటీషన్ లో ప్రశ్నించారు.
ఇరువర్గాల వాదనలు..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్థించింది. అయితే పోస్టల్ బ్యాలట్ లెక్కింపుపై రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా చెల్లుతుందని ఈసీ ఇచ్చిన ఆదేశాలను వైసీపీ నేతలు సవాల్ చేశారు. ఇద్దరి తరుపున వాదనలు విన్న హైకోర్టు రేపు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు చెప్పనుంది.
Next Story