Tue Mar 11 2025 06:45:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు మధ్యంతర బెయిల్పై తీర్పు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది

స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు కోర్టు నెంబరు 30లో ఒకటో నెంబరు ఐటమ్ గా లిస్ట్ కావడంతో మధ్యంతర బెయిల్ పిటీషన్ పై ఉదయమే తీర్పు వచ్చే అవకాశాలున్నాయి.
తీర్పుపై ఉత్కంఠ...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన 53రోజుల నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన కుడి కంటికి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. అయితే చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు రావాలని టీడీపీ క్యాడర్ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతుంది. ఆయన బయటకు రావాలంటూ దేవుళ్లకు మొక్కుకుంటోంది.
Next Story