Mon Dec 23 2024 01:43:28 GMT+0000 (Coordinated Universal Time)
దువ్వాడ కుటుంబంపై పోలీసు కేసులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిముందు హైడ్రామా కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటిముందు కార్ షెడ్లోనే ఆయన భార్య వాణి, పిల్లలు రాత్రి నిద్రించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిముందు హైడ్రామా కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటిముందు కార్ షెడ్లోనే ఆయన భార్య వాణి, పిల్లలు రాత్రి నిద్రించారు. తమను ఇంట్లోకి అనుమతివ్వాలని, తమతో మాట్లాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు.
పరస్పర ఫిర్యాదులతో...
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సందర్భంలో దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు అయింది. దువ్వాడ శ్రీనివాస్, అతని సోదరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story