Wed Nov 06 2024 04:47:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రాష్ట్రస్థాయి ఉన్నత స్థాయి సమావేశం
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులుపాల్గొననున్నారు. మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలుకూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఆన్ లైన్ విధానంలో జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొంటారు. ఎస్పీలు, జిల్లా, మండల స్థాయి అధికారులుకూడా ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమస్త అధికార యంత్రాంగానికి దిశా నిర్ధేశం చేయనున్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యాలు...
సింపుల్ గవర్నమెంట్...ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే అంశం పై సమావేశం జరగనుంది. ప్రజల అర్జీల సత్వర పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టడం, ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం తీసుకురావడం వంటి అంశాలపై చంద్రబాబు దిశా నిర్ధేశం చేయనున్నారు. అభివృద్దికి 10 సూత్రాలతో ప్రణాళికి సిద్దం చేసిన ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఈ లక్ష్యాల సాధనకు ఆయా శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడానికి ఈ సమావేశం జరుగుతుంది. కేబినెట్ అనంతరం జరగనున్న ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం చంద్రబాబు నిర్వహించనున్నారు.
Next Story