Wed Jan 15 2025 21:12:20 GMT+0000 (Coordinated Universal Time)
31 నుంచి బీఈడీ కౌన్సిలింగ్
జనవరి 31 నుంచి బీఈడీ కౌన్సిలింగ్ జరగనుందని ఉన్నత విద్యాశాఖ మండలి ఉత్తర్వులు జారీ చేసింది
జనవరి 31 నుంచి బీఈడీ కౌన్సిలింగ్ జరగనుందని ఉన్నత విద్యాశాఖ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ను విడుద చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు బీఈడీ కౌన్సిలింగ్ జరగనుందని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కోర్టును ఆశ్రయించడంతో...
2023 జూలై 14న ఎడ్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. తర్వాత నెలలు గడిచినా కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో అభ్యర్థులు కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై బీఈడీ కళాశాాలల యజమాన్యాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. .హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఉన్నత విద్యామండలి ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ కౌన్సిలింగ్ ద్వారా మొత్తం 34 వేల సీట్ల భర్తీ కానున్నాయి.
Next Story