Mon Dec 23 2024 12:50:05 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

మాజీ సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాయదుర్గం బహిరంగ సభలో జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అతి దారుణంగా మాట్లాడారని.. వైఎస్ విజయమ్మను కించపరిచారని ఆరోపించారు మాధవ్. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని ముక్కు నేలకు రాసి వెంటనే క్షమాపణ చెప్పాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. 75ఏళ్ల చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు..ఎన్నో ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పని చేశారు.. హోదాగా ఉండాల్సింది పోయి నీచమైన మాటలు ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును ఏమైనా అంటే ముసలి కన్నీరు పెడతారనే సంగతి తెలిసిందే. చంద్రబాబు జగన్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.
Next Story