Mon Dec 23 2024 04:45:29 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను రెచ్చగొట్టారు : బాలకృష్ణ
తనను మంత్రి అంబటి రాంబాబు రెచ్చగొట్టారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
తనను మంత్రి అంబటి రాంబాబు రెచ్చగొట్టారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అందువల్లనే తాను మీసం తిప్పాల్సి వచ్చిందన్నారు. తాను మీసం తిప్పితే వాళ్లు తొడ కొట్టారని దీంతో తాను కూడా తేల్చుకుందాం రా అని సవాల్ విసిరానని బాలకృష్ణ తెలిపారు. ఇక సహించి లాభం లేదని జనం బయటకు వచ్చి ఈ ప్రభుత్వం పై తిరుగుబాటు చేయక తప్పదని బాలయ్య హెచ్చరించారు.
వృత్తిని కూడా...
రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి కంపు కొడుతుందన్నారు. లిక్కర్ ఏరులై పారుతుందన్న బాలయ్య అన్ని వ్యవస్థలు ఈ ప్రభుత్వ హయాంలో భ్రష్టుపట్టి పోయాయని బాలకృష్ణ మండి పడ్డారు. మరోసారి జగన్ ను ఎన్నుకుంటే ఇక రాష్ట్రాన్ని వదిలి పెట్టి అందరూ వెళ్లి పోవాల్సిందేనని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన వృత్తిని కూడా వారు అవమానించారంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
Next Story