Fri Dec 20 2024 18:06:47 GMT+0000 (Coordinated Universal Time)
Nandamuri Balakrishna : ఇద్దరం కలిశాం.. ఇక అంతే
తెలుగుదేశం, జనసేన కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
తెలుగుదేశం, జనసేన కలయిక కొత్త శకానికి నాంది అని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలకృష్ణ జనసేన కండువా కప్పుకుని అలరించారు. రెండు పార్టీలూ కలిస్తే ఇక చరిత్ర సృష్టించడం ఖాయమని బాలకృష్ణ అన్నారు. ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఉద్యమించండి.. బయటకు రండి...
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. మూడు రాజధానులంటూ కాలయపన చేస్తున్నారన్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఉద్యోగాలు లేక అనేక మంది యువత ఇబ్బంది పడుతున్నారని బాలకృష్ణ అన్నారు. ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం తేలేకపోయిందన్న నందమూరి బాలకృష్ణ టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని చెప్పారు. ప్రజలంతా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేరకంగా పోరాడేందుకు బయటకు రావాలని నందమూరి బాలకృష్ణ పిలుపు నిచ్చారు.
Next Story