Sun Dec 22 2024 18:59:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వర్గం నేతలను బాబు వాడుకుంటున్నారు
ఫేక్ సర్టిఫికేట్లు తేవడం చంద్రబాబుకు అలవాటేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు
ఫేక్ సర్టిఫికేట్లు తేవడం చంద్రబాబుకు అలవాటేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అమెరాకా నుంచి దొంగ సర్టిఫికేట్ తెప్పించుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ తనపై చంద్రబాబు అండ్ కో బురదజల్లే ప్రయత్నం చేశార్నారు. అమెరికాలోని ఎక్లిపస్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అది తాము ఇచ్చిన సర్టిఫికేట్ కాదని తేల్చి చెప్పిందన్నారు. వీడియో, సర్టిఫికేట్ ఫేక్ అయినప్పుడు ఈ పార్టీ కూడా ఫేక్ అని ఆయన ఫైర్ అయ్యారు. టీడీపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఆలోంచించాలని, తనపైకి కేవలం పార్టీలోని ఈ వర్గం నేతలనే చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ప్రమాణం చేసేందుకు...
తాను కాణిపాకం వినాయకుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు ఓటు నోటు కేసులో ఆ గొంతు కాదని ప్రమాణం చేయలగలరా? అని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. చంద్రబాబు ఓటుకు కోట్ల కేసులో వారి అనుకూల మీడియాలో ఎందుకు డిబేట్లు పెట్టరని నిలదీశారు. నందమూరి బాలకృష్ణ మహిళల గురించి నీచంగా మాట్లాడారని, ఆయన పై ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పాలన్నారు. లోకేష్ అమెరికా వెళ్లి మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తే ఎందుకు ఆ వర్గం మీడియాలో చర్చించరని గోరంట్ల మాధవ్ నిలదీశారు.
Next Story