Tue Apr 22 2025 12:46:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
మాండూస్ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

మాండూస్ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి పాఠశాలలను మూసివేయాలని అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలను ఆదేశించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండి భారీ వర్షాలు పడతాయని, ఈదురు గాలులు వీస్తాయని చెప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా జిల్లా కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
పాఠశాలలు తిరిగి ఎప్పుడు ప్రారంభించాలన్న సమాచారాన్ని తర్వాత తెలియజేస్తామని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. పురాతన భవనాల నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అధికారులందరూ పనిచేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
Next Story