Mon Dec 15 2025 06:26:52 GMT+0000 (Coordinated Universal Time)
Vangalapudi Anitha : జగన్ వన్నీ అబద్ధాలే.. జరిగింది నాలుగు హత్యలే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇది అలావాటేనని ఆమె అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజకీయ హత్యలు జరిగేవని, కానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు వ్యక్తిగత కారణాలతో కూడినవి అన్నారు.
వర్గ విభేదాలతోనే....
వినుకొండలో వర్గవిభేదాలతోనే హత్య జరిగిందని హోంమంత్రి వనిత అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక..రాజకీయ హత్యలు నాలుగు మాత్రమే జరిగాయన్నారు. అందులో ముగ్గురు టీడీపీ వాళ్లే చనిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. 36 హత్యలు జరిగాయంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నిందితులపై పార్టీలకతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Next Story

