Thu Dec 19 2024 14:48:49 GMT+0000 (Coordinated Universal Time)
Red Book : రెడ్ బుక్ ఎందుకో చెప్పిన హోంమంత్రి వంగలపూడి అనిత
తమ పార్టీ యువనేత నారా లోకేష్ ఎన్నికలకు ముందు రెడ్ బుక్ ను ఎందుకు తయారు చేశారో హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు
తమ పార్టీ యువనేత నారా లోకేష్ ఎన్నికలకు ముందు రెడ్ బుక్ ను ఎందుకు తయారు చేశారో హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రెడ్ బుక్ ను తయారు చేసింది ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి కాదని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్ట ప్రకారమే చర్యలుంటాయని వంగలపూడి అనిత తెలిపారు. నిజంగా కక్ష సాధింపు అనేదే తమకు ఉంటే ఇంత కాలం ఎందుకు ఆగుతామని ఆమె ప్రశ్నించారు. పగలు, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన తమకులేదన్న హోం మంత్రి తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన విధంగానే రాష్ట్ర అభివృద్ధి కోసమే అందరం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు.
నాలుగు అంశాల అజెండాతోనే...
తాము నాలుగు అంశాలను అజెండా పెట్టుకున్నామని చెప్పారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, ఆ శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖను పూర్తిగా నాశనం చేశారన్నారు. కేవలం కొందరి బందోబస్తుకే ఆ శాఖను వినియోగించారని, ప్రజలను రక్షించడానికి కాని, శాంతి భద్రతలను పరిరక్షించడానికి కానీ పోలీసులను వినియోగించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ను కూడా కొత్తగా నియమించలేదన్నారు. ఒక్క పోలీస్ స్టేషన్ ను కూడా నిర్మించలేదన్నారు. గంజాయిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత తెలిపారు.
Next Story