Mon Dec 23 2024 03:51:35 GMT+0000 (Coordinated Universal Time)
డేటా చౌర్యం వాస్తవమే.. హౌస్ కమిటీ నిర్ధారణ
2016 నుంచి 2019 వరకూ ఉన్న ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
2016 నుంచి 2019 వరకూ ఉన్న ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు తమ కమిటీ నిర్ధారించిందన్నారు. హోం, ఐటీ శాఖల అధికారులతో నాలుగురోజుల పాటు చర్చించిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు. డేటా చౌర్యం చేసి దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించారని, అవి వైసీపీకి అనుకూల ఓట్లు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
పెద్దల అండదండలతోనే...
ఇందులో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో డేటా చౌర్యం పై వైసీపీ రచ్చ చేయడంతో ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని, అయితే అప్పట్లో ఆ సిట్ నామమాత్రంగా పనిచేసిందని ఆయన తెలిపారు. పెద్ద కుట్ర జరిగిందని చెప్పారు. ఈరోజు పెగాసస్, డేటా చౌర్యంపై హౌస్ కమిటీ సమావేశమయింది. సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయాలను వెల్లడించారు.
Next Story