Sun Dec 22 2024 09:25:51 GMT+0000 (Coordinated Universal Time)
నందిగామలో ధోనీ వంద అడుగుల కటౌట్
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పుట్టిన రోజు సందర్భంగా నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని పుట్టిన రోజు సందర్భంగా నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నుంచి రిటైర్ అయినా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కోట్లాది మంది అభిమానులున్నారు. ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వంద అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి.. ధోనిపై తమ అభిమానం చాటుకున్నారు.
రేపు పుట్టిన రోజు...
ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోని బర్త్ డే ఈ నెల 7వ తేదీన జరగనుంది. పుట్టిన రోజుకు ఒక రోజు ముందు శనివారం ఈ కటౌట్‌ను ఫ్యాన్స్ నందిగామలో ఏర్పాటు చేవారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆశిష్కరించారు. ధోని బర్త్‌డేను రోజు నందిగామలో వంద అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.
Next Story