Mon Dec 23 2024 09:26:21 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం : మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య !
ఫిబ్రవరి 3వ తేదీన బాధిత మహిళ నిద్రపోతున్న సమయంలో ఎదురింట్లో ఉండే దిలీప్, అతడి భార్య తులసి వచ్చి మహిళ నోరు గట్టిగా
మహిళపై భర్త అత్యాచారం చేస్తుండగా.. భార్య వీడియో తీసిన దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో గల ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రిస్తున్న మహిళపై ఎదురింట్లో నివాసముంటున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా చూస్తున్న భార్య.. తన భర్తను అడ్డుకోవాల్సింది పోయి.. వీడియో తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఈనెల 3వ తేదీన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నిందితుడు దిలీప్, అతని భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు.
Also Read : లేస్ చిప్స్ ప్యాకెట్ తో ఇలా శారీ తయారు చేశారా ?
ఫిబ్రవరి 3వ తేదీన బాధిత మహిళ నిద్రపోతున్న సమయంలో ఎదురింట్లో ఉండే దిలీప్, అతడి భార్య తులసి వచ్చి మహిళ నోరు గట్టిగా మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. మహిళపై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడగా.. ఇదంతా భార్య తులసి వీడియోలు, ఫొటోలు తీసింది. మర్నాడు వాటిని చూపించి మరోమారు నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తే.. పిల్లలను చంపేసి, వీడియోలు, ఫొటోలు బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా.. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ పదే పదే వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story