Mon Dec 23 2024 02:28:15 GMT+0000 (Coordinated Universal Time)
సోషల్ మీడియాలో భార్య అసభ్యకర దృశ్యాలు.. చూసి తట్టుకోలేక..
తూర్పు గోదావరి జిల్లా వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. ఆమె భర్త స్వగ్రామమైన గోకవరంలో
సోషల్ మీడియా ఓ కుటుంబ ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలను సోషల్ మీడియాలో చూసి తీవ్రమనస్తాపానికి గురయ్యాడు భర్త. ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక.. తన పిల్లలకు విషమిచ్చి.. తానూ విషం తాగాడు. ప్రస్తుతం భర్త, పదేళ్ల కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Also Read : కథక్ నాట్యాచార్య పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూత
తూర్పు గోదావరి జిల్లా వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. ఆమె భర్త స్వగ్రామమైన గోకవరంలో ఉంటుండగా.. వారి ఇద్దరు కొడుకులు (13,10) కూతురు (12) అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. తండ్రి అప్పుడప్పుడూ వెళ్లి పిల్లల్ని చూసి వస్తుంటాడు. పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం వంగలపూడిలో ఉన్న పిల్లలవద్దకు వెళ్లాడు తండ్రి. ఇంట్లో సరదాగా కాసేపు గడిపి.. పిల్లల్ని బయటికి తీసుకెళ్లాడు. గ్రామంలో నిర్జనంగా ఉన్న తోటలోకి పిల్లల్ని తీసుకెళ్లి.. తనతోపాటు తీసుకొచ్చిన విషాన్ని తాగి, ఆ తర్వాత ముగ్గురు పిల్లలకూ తాగించే ప్రయత్నం చేశాడు.
తమ తండ్రి విషమిస్తున్నాడని తెలియక.. పిల్లలు కూడా తాగేందుకు ప్రయత్నించారు. కానీ పెద్దకొడుకు, కూతురు అది చేదుగా ఉండటంతో తాగలేదు. చిన్నకొడుకు మాత్రం విషం తాగేశాడు. మిగతా ఇద్దరితో బలవంతంగా విషం తాగించే ప్రయత్నం చేసేలోపు ఆ ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియని పిల్లలు అమాయకంగా అలాగే కూర్చున్నారు. కొద్దిసేపటికి వారిని అటుగా వెడుతున్న కొందరు స్థానికులు గమనించారు. విషయం గ్రహించి, వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎస్ఐ శుభశేఖర్ ఘటనా ప్రాంతానికి చేరుకుని, తండ్రి - కొడుకుని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆదివారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందని ఆరా తీసిన పోలీసులకు.. జరిగిన విషయం తెలిసింది.
Also Read : పొట్టేలు అనుకుని మనిషి తల నరికేశాడే?
సమీప బంధువుల నుంచి సామాజిక మాధ్యమాల్లో తన భార్యకు సంబంధించిన అసభ్యకర వీడియో వచ్చిందని.. దాంతో తాను మనస్థాపానికి గురై ఇలా చేశానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పాడు. కాగా.. అతడు చెబుతున్న వీడియో పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అతడు ఆటో నడుపుతాడని, గతంలో అతను చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో అతడిపై కేసులు ఉన్నాయని తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story