Thu Dec 19 2024 08:36:52 GMT+0000 (Coordinated Universal Time)
భార్య మరోవ్యక్తితో తిరుగుతుందన్న అనుమానంతో..
సజావుగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఉషరావు తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని..
స్మార్ట్ యుగంలో దాంపత్య జీవితాలు అనుమానం అనే జబ్బుతో బీటలు వారుతున్నాయి. అనుమానం ఒక్కసారి తల్లోకి చేరితే.. అంత తేలిగ్గా వదలదు. అలా భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. దాబా పై నుంచి కొడుకుతో సహా తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ తల్లికొడుకులు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లాలో ఉషరావు అనే వ్యక్తి భార్య మల్లేశ్వరి, కొడుకు భార్గవ్ సాయితో కలిసి నివాసం ఉంటున్నాడు. సజావుగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఉషరావు తన భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందేమోనని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఆమెను ప్రతిరోజు వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఎవరితోనూ ఎలాంటి ఎఫైర్ లేదని మొరపెట్టుకున్నా నమ్మలేదు. చివరికి భార్యకు ఒక కండీషన్ పెట్టాడు. తనకు పరాయి వ్యక్తితో సంబంధం లేదని గుడిలో ప్రమాణం చేయాలన్నాడు. అందుకు కూడా మల్లీశ్వరి ఒప్పుకుంది.
ఈ క్రమంలో మల్లీశ్వరి, కొడుకు భార్గవ్ సాయిని తీసుకుని ఉషరావు పెనుగంచిప్రోలుకి వచ్చాడు. మాయమాటలతో ఇద్దరినీ దాబాపైకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి కిందికి తోసేశాడు. తీవ్రగాయాలపాలైన ఇద్దరినీ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు భర్త ఉషరావుని అదుపులోకి తీసుకుని.. హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Next Story