Mon Dec 23 2024 15:25:42 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : అయ్యన్న ఇంటి వద్దనే పోలీసులు... ఉద్రిక్తత
నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది.
నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. ఆయన కోసం పోలీసులు వేచి ఉండటంతో అరెస్ట్ చేయడానికే వచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలు కూడా మొహరించడంతో అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని పోలీసులు చెప్పినా ఆయన కోసం వేచి చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
నోటీసులు ఇచ్చినా...Td
నిన్న ఉదయం అయ్యన్న పాత్రుడి ఇంట్లో నలజర్ల పోలీసుల 41 ఎ కింద నోటీసులు జారీ చేశారు. అయితే అయ్యన్న ఇంట్లో లేరని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. తర్వాత రాత్రికి తిరిగి పెద్దయెత్తున పోలీసు బలగాలు రావడంతో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు వచ్చారని ప్రచారం జరిగింది. అయ్యన్న మాత్రం ఇంట్లో లేరని చెప్పడంతో ఆయన కోసం చాలా సేపు అక్కడే వేచి ఉన్నారు. ఈరోజు కూడా అదే పరిస్థిితి కొనసాగే అవకాశముంది.
Next Story