Mon Dec 23 2024 05:05:47 GMT+0000 (Coordinated Universal Time)
ఈ మూడేళ్లు సంతృప్తిగా పనిచేశా : మంత్రి వెల్లంపల్లి
ఏపీ కేబినెట్ మంత్రుల రాజీనామా నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడే..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఈ మూడేళ్లు ఎంతో సంతృప్తిగా పనిచేశానని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. నేడు ఏపీ కేబినెట్ మంత్రుల రాజీనామా నేపథ్యంలో.. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడే సీఎం జగన్ మధ్యలో 90 శాతం మంత్రులను మారుస్తానని చెప్పారన్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభమయిందన్నారు. సీఎం ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.
పార్టీ బాధ్యతైనా.. ప్రభుత్వ బాధ్యతైనా సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అంశాల గురించి మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఏపీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని, ఆ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని గుర్తుచేసుకున్నారు.
Next Story