Fri Dec 27 2024 02:39:25 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : విశాఖకు జగన్
ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ నేడు విశాఖలో జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ఈ ప్లీనరీలో పాల్గొనేందుకు విశాఖ బయలుదేరి వెళ్లారు.
ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ నేడు విశాఖలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ ప్లీనరీలో పాల్గొనేందుకు విశాఖ బయలుదేరి వెళ్లారు. 74 దేశాలకు చెందిన రాయబారులు, మంత్రులు, ఇతర ప్రతినిధులు ఈ సదస్సుకు వస్తున్నారు. ఈరోజు నుంచి ఎనిమిదోతేదీ వరకూ ఈ ప్లీనరీ జరగనుంది. దాదాపు 52 ఏళ్ల తర్వాత భారత్ లో జరుగుతున్న ఈ సదస్సు విశాఖ వేదిక కావడం గమనార్హం.
అంతర్జాతీయ సదస్సుకు...
రాడిసన్ బ్లూ హోటల్ లో జరగనున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. వ్యవసాయం, నీటి కొరత అధిగమించడంపై ఈ సదస్సు ప్రధానంగా జరగనుంది. దీంతో పాటు అనేక పర్యావరణ అంశాలకు సంబంధించిన వాటిపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కూడా హాజరు కానున్నారు. సదస్సును ప్రారంభించిన అనంతరం తిరిగి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story