Thu Dec 19 2024 09:07:25 GMT+0000 (Coordinated Universal Time)
కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న స్నేహారెడ్డి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన పిల్లలు అయాన్, అర్హలతో పాటు కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చిన స్నేహారెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
మెట్ల మార్గం నుంచి...
కాలినడకన వచ్చి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి మెట్ల మార్గం నుంచి ఆమె కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు స్నేహారెడ్డికి తీర్థ ప్రసాదాలను అందచేశారు. స్నేహారెడ్డి తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా తిరుమలకు వచ్చారు. స్నేహారెడ్డిని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
Next Story