Mon Dec 23 2024 13:00:53 GMT+0000 (Coordinated Universal Time)
అలర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిన్నటి వరకూ భగభగ మండిన సూరీడు సైడ్ అయ్యాడు. ఉన్నట్టుండి వాతావరణమంతా చల్లగా మారి.. భారీ వర్షాలు, వడగండ్ల వానలు మొదలయ్యాయి. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు గాలికోత గా అంతర్గత తమిళనాడు నుండి మధ్య ప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం నుండి బంగ్లాదేశ్ & పొరుగుప్రాంతాల పై నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేస్ వరకు గంగా నది పశ్చిమ బెంగాల్ & ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడింది.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో చలితీవ్రత పెరిగింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ఏపీపై గులాబ్ తుపాను ప్రభావం చూపుతుందని తెలుపడంతో.. రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. మినప, మిరప, వరి రైతులు భారీ వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
మచిలీపట్నం- దివిసీమ బెల్ట్ కు భారీ వర్షసూచన
మచిలీపట్నం-దివిసీమ బెల్ట్ లో శుక్రవారం సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మచిలీపట్నం-దివిసీమ ప్రాంతాల ప్రజలు, రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. మచిలీపట్నం, విజయవాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం వరకూ భారీ వర్షాలు కురవవచ్చని తెలిపారు.
Next Story