Mon Dec 15 2025 02:03:46 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert: ఏపీలో 5 రోజుల పాటూ భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. బలమైన ఉపరితల గాలులు, గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా APలోని పలు ప్రదేశాలలో రాబోయే రోజుల్లో భారీ వర్షపాతం కొనసాగుతుందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆదివారం సాయంత్రం.. హైదరాబాద్ అతలాకుతలం:
గ్రేటర్ హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 6 గంటలు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు, బల్దియా, హెచ్ఎండీఏ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సిటీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం టీమ్తో మేయర్ గద్వాల విజయలక్ష్మీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Next Story

