Mon Dec 15 2025 04:01:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ
నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ జరుగుతుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది

నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసుల విచారణ జరుగుతుంది. ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసం, భీమిలి బిల్డింగ్ సొసైటీకి కేటాయించిన 280 ఎకరాల స్థలం రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ హైకోర్టులో ఇటీవల పిల్ వేశారు. దీనిపై విచారణ నేడు జరగనుంది. అదే డివిజనల్ బెంచ్ కోర్టు నెంబరు-ఒకటిలో.. భీమిలి తీరంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలపై వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ కొనసాగనుంది.
విశాఖలో...
దీంతో పాటు కోర్టు ఆదేశాలతో గత కొన్ని రోజులుగా జీవీఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చుతున్న సంగతి విదితమే. ఇప్పటి వరకు జీవీఎంసీ భీమిలిలో నేహారెడ్డి నిర్మాణాలపై తీసుకున్న చర్యలేంటనేది నేడు కోర్టుకు నివేదించాల్సి ఉంది. ఈ రెండు కేసులతోపాటు.. కైలాసగిరి కొండ కింద పార్కింగ్ ఏరియాలో నిర్మాణాలపై మూర్తియాదవ్ వేసిన మరో కేసు విచారణ కూడా జరగనుంది. దీంతో ఈ కీలక కేసుల్లో విచారణ పూర్తయి ఎలాంటి తీర్పు వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

