Mon Dec 23 2024 10:17:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది
ఆంధ్రప్రదేశ్ లో పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఈ నెల 16వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గతంలో మిగిలిపోయిన, వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాలకు రెండు రోజుల క్రితం పోలింగ్ జరిగింది.
కట్టుదిట్టమైన భద్రత...
ఈ ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం ప్రారంభమయింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 144వ సెక్షన్ ను అమలు చేశారు.
Next Story