Thu Jan 09 2025 23:59:28 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీ ఉద్యోగుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. దశల వారీగా కార్యాచరణను ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. దశల వారీగా కార్యాచరణను ప్రకటించాయి. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాలు వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు 71 డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
దశలవారీగా....
అయితే పది రోజుల్లో పీఆర్సీపై స్పష్టత వస్తుందని ఇటీవల ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం నేటి నుంచి ఆందోళనకు వెళ్లాలని నిర్ణయించాయి. అమరావతి జేఏసీ, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగ ప్రభుత్వ ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారు. విధులకు హాజరై తమ నిరసన తెలియజేయడమే తొలిరోజు కార్యక్రమం.
Next Story