Sat Nov 23 2024 09:28:09 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas Cylender : ఉచిత గ్యాస్ సిలిండర్ ఎంతమందికి అందిందో తెలుసా? రికార్డు స్థాయిలో?
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 1వ తేదీ నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 1వ తేదీ నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మంచి స్పందన లభించింది. తొలి విడత గత నెల 29వ తేదీ నుంచి బుకింగ్స్ ఉచిత గ్యాస్ సిలిండర్ కు ప్రారంభమయ్యాయి. నవంబరు 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందచేస్తామని తెలిపారు. ఆ మేరకు ఈ నెలలో మాత్రం ముందు గ్యాస్ బుక్ చేసుకుని నగదు చెల్లిస్తే ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదును జమ చేస్తుంది.
బుక్ చేసుకున్న వారందరికీ...
అయితే తొలి విడతగా ఇప్పటి వరకూ పదహారు లక్షల మంది వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఏడాదికి మూడు విడతలుగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందే వీలుండటంతో తమ ఇంట్లో ఇంకా గ్యాస్ సిలిండర్ పూర్తి కాకపోవడంతో ఇంకా అనేక మంది తొలి విడత సమయానికి బుక్ చేసుకోలేదని చెబుతున్నారు. ఈపథకం కోసమే ఎదురు చూస్తున్న అనేక మంది మహిళలు మాత్రం గ్యాస్ కంపెనీ ఏజెన్సీలకు వెళ్లి మరీ ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. పదహారు లక్షల మందికిపైగానే బుక్ చేసుకోగా వారిలో ఉచిత గ్యాస్ సిలిండర్ 48 గంటల్లో డెలివరీ కూడా అయింది. తర్వాత వారి ఖాతాల్లో నగదు ప్రభుత్వం జమ చేసింది.
అనూహ్య స్పందన...
మహిళల నుంచి మంచి స్పందన రావడంతో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి వచ్చే నెల నుంచి ముందుగానే నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి నెల కావడంతో ముందుగా నగదును లబ్దిదారులు చెల్లించాల్సి వచ్చిందని, ఈసారినెల నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెంటనే నగదు జమ అయ్యేలా ( సిలిండర్ డెలివరీ కాకముందు) చెల్లించేలా ప్రభుత్వం పద్ధతిని తీసుకు వస్తుంది. తెలుపు రంగు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఎల్పీజీ కనెక్షన్ ఉంటే చాలు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే వీలుంది.
టోల్ ఫ్రీ నెంబరుకు...
ఇక 1967 నెంబరుకు పెద్దగా ఫిర్యాదులు కూడా రాలేదు. ఒకటి అరా వచ్చినా వెంటనే వాటిని అధికారులు పరిష్కరిస్తున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. పెద్దగా ఫిర్యాదులు అందలేదని, అంటే అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందినట్లే తాము భావిస్తున్నామని తెలిపారు. అన్నీ అర్హతలుండి గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందకపోతే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబరు 1967 ను పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పెద్దగా ఫిర్యాదులు రాకపోవడంతో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగుతుందన్న అభిప్రాయం అధికారిక వర్గాల్లో వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఆదిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా సాఫీగా ఈ ప్రక్రియ సాగుతుంది.
Next Story