Fri Nov 22 2024 20:25:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విద్యాసంస్థల బంద్
ఆంధ్రప్రదేశ్ లో నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి
ఆంధ్రప్రదేశ్ లో నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయం.. అనంతరం ఆందోళన ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు బంద్ పాటించాలని వివిధ విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, కళాశాలలు మూసివేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అన్ని చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటు పరం చేస్తామని చెప్పడంతో కార్మికులు ఆందోళన ప్రారంభించారు. అన్ని యూనియన్లు కలసి జేఏసీగా ఏర్పడి చేస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తయింది. ఈ పరిస్థితుల్లో కార్మిక సంఘాలకు మద్దతుగా ఈరోజు బంద్ పాటించాలని విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. ఈ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ కు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Next Story