Tue Dec 24 2024 02:41:40 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల పై ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల పై ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. జీవో నెంబరు 35 కొట్టివేత రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. దీంతో టిక్కెట్ల ధరల తగ్గింపు నిర్ణయం పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 35ను మరోసారి హైకోర్టు కొట్టివేసినట్లయింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఈ నెంబరు 35ను కొట్టివేయగా దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది.
కమిటీని నియమించాలని...
ఈరోజు సినిమా టిక్కెట్ల ధరలపై విచారించిన ధర్మాసనం ఇందుకోసం కమిటీని నియమించాలని ఆదేశించింది. జీవో నెంబరు కొట్టివేత అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పేర్కొంది. ఇటీవల డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో కేవలం పిటీషనర్లకే అది వర్తిస్తుందని పేర్కొనడంతో కొన్ని ప్రాంతాల్లోనే జీవో నెంబరు 35ను అమలు చేశారు. దీంతో ఈరోజు హైకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
Next Story